
జనవరి 19 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా… మండలంలో కొనసాగుతోన్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్షేత్రస్థాయిలో సందర్శించి, నిశితంగా పరిశీలించారు. సందర్భంగా ఇప్పటివరకు ఎంత మేరకు సర్వే జరిగింది? ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి? వంటి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి,వారి సమస్యలపై ఆరా తీసి, సందేహాలను నివృత్తి చేసి, భరోసా కల్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతోందని,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో అభ్యంతరాలను, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు (లేదా) కొత్త సభ్యుల చేర్పులకు దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులను అందజేస్తామని, కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యులు లేని వాటి దరఖాస్తులను అదే విధంగా గతంలో మీ-సేవా కేంద్రాల్లో కొత్తగా కుటుంబ సభ్యుల చేర్పుల కోసం, మ్యుటేషన్స్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, ప్రజాపాలన సేవా కేంద్రంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షుణ్ణంగా సర్వే జరుగుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా జిల్లాలో వంద శాతం పూర్తయ్యిందని. అలాగే గ్రామ సభలను నిర్వహించి, వాటిలో ఈ లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తామని, అందులో ఏమైనా అభ్యంతరాలు వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఎంపీడీవో మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.