
పయనించే సూర్యుడు ,ఫిబ్రవరి 4,అశ్వాపురం:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని బిజెపి నాయకులు అశ్వాపురం మెయిన్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు తాటిపాముల ఐలయ్య మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా భారత దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ద్రోహద పడుతుందని తెలిపారు వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలందరికీ ఈ బడ్జెట్ వల్ల లాభం చేకూరుతుందని పేర్కొన్నారు ఈ బడ్జెట్ వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు వ్యక్తిగత ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయింపు నివ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్లూరి రామారావు ప్రధాన కార్యదర్శి సున్నం సారయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు సురకంటి లింగారెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లులింగారెడ్డి ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గోసుల రాములు మండల కార్యదర్శి కోలా భాస్కర్ ఉపాధ్యక్షులు బండ్ల నాగేశ్వరరావు గిరిజన మోర్చా మండల నాయకులు కల్లూరి నరసింహారావు మండలసోషల్ మీడియా కన్వీనర్ ఉమ్మా సుధాకర్ రెడ్డి తాటి చిరంజీవి బెజ్జంకి రాజమౌళి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.