
చర్లపల్లి ఇందిరమ్మ గృహకల్పలో ఆక్రమణలను కూల్చేసిన తహసిల్దార్ సుచరిత.
పయనించే సూర్యడు,జనవరి 30.కాప్రా ప్రతినిధి సింగం రాజు
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే సహించేది లేదని కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కాప్రా మండల తాసిల్దార్ సుచరిత హెచ్చరించారు.చర్లపల్లి ఇందిరమ్మ గృహకల్ప కాలనీలో సెప్టిక్ ట్యాంకులను చెరబట్టి రాత్రికి రాత్రే నిర్మాణాలు జరుపుతున్నారని చర్యలు చేపట్టాలంటూ రెండు రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ కి చర్లపల్లి కాలనీల సమాఖ్య సి సి ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.చర్లపల్లి ఇందిరమ్మ గృహకల్ప కాలనీలోని ఆక్రమణలపై తీవ్రంగా స్పందించిన తాసిల్దార్ సుచరిత గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి కట్టడాలను కూల్చి నేలమట్టం చేశారు.సెప్టిక్ ట్యాంకులను ఆక్రమించి రాత్రికి రాత్రే నిర్మించిన ప్రహరీ గోడను గేట్లతో సహా జెసిబి తో రెవిన్యూ సిబ్బంది కూల్చేశారు.