ప్రముఖ సినీ నటుడు సుమన్‌కు ఘన స్వాగతం.

September 18, 2026 | తెలంగాణ

బాలాజీనగర్‌లో వినాయక మండపాన్ని సందర్శించిన నటుడు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 18 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి.తెలుగు సినీ రంగంలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సినీ నటుడు సుమన్ బాలాజీనగర్‌లోని మన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం అసోసియేషన్ సభ్యులు సుమన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం సుమన్ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రముఖ నటుడు సుమన్ వినాయక మండపానికి విచ్చేయడంతో బాలాజీనగర్ వాసులు, అసోసియేషన్ సభ్యులు, భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమన్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ నటుడు సుమన్ తమ మండపాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper