
పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.21/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి జిల్లా తడ సమీపంలోని బోలింగాల పాడు వద్ద శుక్రువారం ఉదయం చిల్లమత్తూరు, పరిసర ప్రాంతాల నుంచి పిల్లలను సూళ్ళూరుపేట లోని ఓ ప్రయివేట్ పాఠశాలకు తరలిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనపై వైకాపా సత్యవేడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి ఓడూరు ఉజ్వలరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని ప్రమాదానికి గురైన బడిపిల్లలను పరామర్శించారు. గాయాల బారిన పడిన విద్యార్థులతో మాట్లాడారు.ప్రయివేట్ విద్యాసంస్థల నిర్లక్ష్య ధోరణి,మన్నిక లేని వాహనాల బస్సుల వినియోగం అభం శుభం తెలియని చిన్నారుల పట్ల శాపంగా మారకూడదని , తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఉజ్వలరెడ్డి, ఈఘటనపై సంబంధిత అధికారులు భాద్యత వహించాలని పేర్కోన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయివేట్ విద్యాసంస్థలు వినియోగిస్తున్న బస్సుల కండిషన్, ఫిట్ నెస్ లను సక్రమంగా తనిఖీ చేసి, కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తూ, చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని అలాగే కార్మికులను పరిశ్రమలకు తరలించే బస్సులను కూడా పర్యవేక్షిచాలని సంబంధిత అధికారులను కోరారు.