పయనించే సూర్యుడు రాజంపేట న్యూస్ :జనవరి 31 : వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 5న ఫీజు పోరు అన్న నినాదంతో ప్రారంభించనున్న దొంగ ఉద్యమాలను ఆపాలనిటిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రూ 2000 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలు నాశనం చేశాడని అన్నారు. ఫీజు పోరు పేరుతో జగన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం హాస్యస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 16 లక్షల మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే గత వైసిపి ప్రభుత్వంలో విడతలవారీగా తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే రూ 788 కోట్లు విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉనికిని చాటుకోవడానికి ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి రావాలని ప్రయత్నిస్తున్నాడని,
ఫీజు పోరు పేరుతో రోడ్డుపై కొచ్చి దొంగ నాటకాలు ఆడితే జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సాయి ప్రసాద్, శివ ప్రసాద్, మోబినిస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : సమావేశంలో మాట్లాడుతున్న రేవూరి వేణుగోపాల్
ఫీజుల పేరుతో దొంగ ఉద్యమాలు ఆపాలి – రేవూరి వేణుగోపాల్
RELATED ARTICLES