
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కడియాల కుంట తండాలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరామా యాడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14: షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగాత్ నరేందర్ నాయక్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కడియాలకుంట తండాలో జరుగుతున్న సేవాలాల్ మహారాజ్ మరియు మేరమ యాడి నూతన గుడి నిర్మాణం మరియు విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు గజస్తంభ స్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన పలు పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారాలను ఏకతాటిపై నడిపి బ్రిటిష్ ప్రభుత్వ లపై ఎదురు దాడి చేసి ఎన్నో యుద్ధాలను చేసి తమ యొక్క బంజారాలను సన్మార్గంలో నడిపించడానికి సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని అన్నారు బంజారాలో అందరూ సేవాలాల్ మహారాజ్ చూయించిన మంచి నడవడికలో నడవాలని బంజారా లు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు గత మూడు రోజులుగా జరుగుతున్న పూజ కార్యక్రమాలు నేటితో ముగిశాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ కోఆర్డినేటర్ రఘునాయక్ ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ చల్ల శ్రీకాంత్ రెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ షాద్నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇబ్రహీం మరియు యువ నాయకులు రాయికల్ శ్రీను కడియాల కుండ తండా తాజా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మాజీ డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్ మాజీ వార్డ్ సభ్యులు తవుసింగ్ పీర్య తండా బురుగుల శ్రీను కాంగ్రెస్ నాయకులు రెడ్యా శంకర్ సేవ్య రాంచందర్ రవి హౌసింగ్ దీప విజయ్ లక్ష్మణ్ రాజు దేవేందర్ మరియు తాండ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు