
జనవరి 29 భద్రాచలం ఇంచార్జి బట్టా శ్రీనివాసరావు
బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతీ ఒక్కరిని కదిలించిన వ్యక్తి గద్దర్.
తెలంగాణా ఉద్యమం లో బండి పాత్ర ఏంటో చెప్పాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్.డిమాండ్.
తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రజాయుద్ద నౌక గద్దర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ డిమాండ్ చేశారు.బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు వున్నాయని ఇది రాష్ట్రపతిని,ప్రధానమంత్రిని అవమానించడమే అన్నారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ భావజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో వుందా అని ఆయన నిలదీశారు.రాజ్యాంగస్ఫూర్తకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన అవార్డులు సంజయ్ వ్యాఖ్యల వల్ల మోదీ ప్రభుత్వాన్ని దిగ్గజార్చినట్లుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర కోసం ప్రతీఒక్కరినీ కదిలించిన వ్యక్తి గద్దర్ అని,తెలంగాణ ఉద్యమంలో బండి పాత్ర ఎంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి స్థాయిని మరిచి గద్దర్ పై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి రాష్ట్రప్రతి తొలగించాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.