
- పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనవరి 18 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా… బచ్చన్న పేట మండల కాంప్లెక్స్ వద్ద ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సంబదింత అధికారులకు ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మత్రు నాయక్, హౌసింగ్ డిఇ బజరంగల్, ప్రత్యేక అధికారి రామారావు నాయక్, ఎమ్మార్వో ప్రకాష్ రావు, ఎంపీడీవో మల్లికార్జున్, పి ఏ సి ఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణ చందర్,నూకల బాల్ రెడ్డి,బోడిగం చంద్రారెడ్డి, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, బావండ్ల కృష్ణంరాజు,గంధ మల్ల నరేందర్,గిద్దల రమేష్, కొండి వెంకటరెడ్డి, బొమ్మెన ఆంజనేయులు, వడ్డేపల్లి మల్లారెడ్డి,మూసిని రాజు, అజీమ్, కైసర్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.