
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 18 మామిడిపెల్లి లక్ష్మణ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు జాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని జగిత్యాల నియోజకవర్గం హడ్ హాక్ కమిటీ సభ్యులు సోమనారాయణ రెడ్డి అన్నారు.శనివారం రాయికల్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తెలుగుదేశం పార్టీ జెండా వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు- బ్రతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి”ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు ఒక సామాజిక బాధ్యత అని నినదించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.మరణం లేని మహానేత యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది అని అన్నారు.బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన మహానేత,తాలూకా వ్యవస్థను రద్దుచేసి మాండలిక వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల వద్దకు పరిపాలన తీసుకువచ్చి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్ప రాజకీయవాది ఎన్టీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో మోర గణేష్,నామని లక్ష్మీ నర్సయ్య,ఎండి సాహెబ్ హుస్సేన్,కల్లెడ రాజరెడ్డి, నాయిని రాజేందర్ గౌడ్, వడ్లకొండ నరేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.