
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (19: జనవరి) (ఆదోని నియోజకవర్గం)… ఆదోని మండలం బసరకోడు గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు యం.తాహేర్ వలి మండల నాయకులు శాంత నవీన్ గ్రామ నాయకులు అంజి యాదవ్ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ త్రాగునీటి సమస్య ఉందని ఇప్పటినుండి గ్రాములు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తామని ప్రజలకు తెలపడం జరిగింది. గ్రామంలో అన్ని వీధులకు త్రాగునీరు వంచే విధంగా గ్రామంలో ఉన్న మినీ ట్యాంకులకు త్రాగునీరు సరఫరా చేసేటట్లు అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
