
బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్)శుక్రవారం రోజు బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ కు న్యాయం జరగాలి. నస్రుల్లాబాద్ సూపర్వైజర్ వాణి మేడం గారి దౌర్జన్యాలకు బొమ్మన్ దేవుపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడి సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. ఈ విషయమై ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామ అంగన్వాడీ టీచర్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణ గారికి న్యాయం కావాలని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి కచ్చితంగా న్యాయం చేస్తాం ఏ టీచర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయకూడదని అంగన్వాడీ టీచర్లందరినీ సూచించినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు. ఎండి. ఖలీల్. గార్లు మాట్లాడుతూ ఏ టీచర్ కూడా ఇలాంటి ఆత్మహత్యయత్నం చేయరాదని ప్రతి టీచర్ కి విజ్ఞప్తి చేస్తూ. ఇప్పటికైనా అధికారుల ఒత్తిడి దౌర్జన్యాలు ఆపాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు వాణి సూపర్వైజర్ గారిని ప్రాజెక్టు నుండి బదిలీ సబ్ కలెక్టర్ గారికి సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేస్తూ అంగన్వాడీ టీచర్లకు వీరి దగ్గర ఉన్న పాత ఫోన్ లను తీసుకొని పెద్దయి ఫోన్లు ట్యాబులు 5 జిబి రామ్ ఫోన్లను తక్షణమే అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.