Saturday, February 1, 2025
Homeఆంధ్రప్రదేశ్బాల్య వివాహాలతో బాలికల భవితకు అవరోధం

బాల్య వివాహాలతో బాలికల భవితకు అవరోధం

Listen to this article

ఐసీడీఎస్ సూపర్ వైజర్ కొండసాని రజిత

పయనించే సూర్యుడు జనవరి 31( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, ముఖ్యంగా బాలికలక భవిత ప్రమాదంలో పడుతుందని ఐసీడీఎస్ గోరంట్ల మండల సూపర్ వైజర్ రజిత కొండసాని ఆందోళన వ్యక్తం చేశారు. గోరంట్లలోని రామశంకరయ్య కాలనీ, పులేరు రోడ్డులోని సంచార జీవనం సాగించే వారి కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, బాలికలపై లైంగిక వేధింపులు, పొక్సో కేసులు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మాతా, శిశువుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. కిసోరి బలికల్లో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఐసీపీఎస్ కౌన్సిలర్ శివలత, సోషల్ వర్కర్ వనజాక్షి, పంచాయతీ సెక్రటరీ సౌమ్య, మహిళా పోలీసులు లక్ష్మీ, ప్రభావతి, అంగన్వాడీ వర్కర్లు పద్మా, ప్రమీల, గాయత్రి, నూర్జహాన్, ఏఎన్ ఎం మల్లీశ్వరి, ఆశా వర్కర్ చిన్నమ్మ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments