పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ మండల పరిధిలో భీమ్గల్ మండల్ ప్రెసిడెంట్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు దొరకంటి నరసయ్య
జాతిపిత మహాత్మాగాంధీ కి.. శిరస్సు వంచి పాదాభివందనాలు..
ఓ మహాత్మా…
ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు..
ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు..
ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు..
ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు..
ఓ మహాత్మా…
మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం..
అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించిఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది. ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లు, వేళాపాళా లేని కరెంట్ కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు. ఓవైపు రుణమాఫీ మోసం.. మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు కారణమైంది ఈ కాంగ్రెస్ సర్కారు. మరోవైపు నేతన్నలకిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత బతుకులు చితికిపోతున్నాయి.
మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏడాదైనా ఉలుకూ పలుకూ లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేశారు. చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారు. యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్నారు.
ఓవైపు రైతులను, మరోవైపు మహిళలను, ఇంకోవైపు వృద్ధులు, వికలాంగులను, 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను, ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము. నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్లీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ ఈ దద్దమ్మ సర్కారుకు 420 హామీల్లో కొన్నైనా అమలుచేసే తెలివినివ్వాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
జై తెలంగాణ
జై భారత్ విగ్రహాలకు వినతిపత్రం…
జాతిపిత మహాత్మాగాంధీ గారికి.. శిరస్సు వంచి పాదాభివందనాలు..
ఓ మహాత్మా…
ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు..
ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు..
ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు..
ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు..
ఓ మహాత్మా…
మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, మాజీ సొసైటీ చైర్మన్ ఓమాయి రాజేశ్వర్, నాయకులు మోయీజ్, శర్మ నాయక్,తూక్కాజి నాయక్, మాణిక్యాల శ్రీనివాస్,మాజీ సర్పంచులు కోగూరు సుమన్,సిద్ధపల్లి రాములు, మాజీ ఎంపీటీసీలు సూళ్ళ నర్సయ్య,చిన్నోళ్ల రాజేశ్వర్, సుర్జిల్, పతాని లింబాద్రి,రాజు నాయక్,మాజీ కౌన్సిలర్లు రజాక్, బోదిరే నర్సయ్య,