
పయనించే సూర్యుడు జనవరి 17 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)కలెక్టర్ కార్యాలయంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు రిప్రజెంటేషన్ కేంద్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలలో కలిపి బీసీలు 11% శాతం మాత్రమే ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో కేవలం 4 లక్షల 62 వేలు మాత్రమే మండల కమిషన్ సిఫార్సుల ప్రకారం32 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాలలో27 %శాతం రిజర్వేషన్లు కల్పించి ఉన్నప్పటికీ బీసీలకు11% శాతం కూడా వాటా లేదు కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరిగేది అనేది నిజం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాజ్ 4ఎ ప్రకారం జనాభా ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాలలో కోర్టులు చెప్పాయి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు ఇప్పటికైనా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శాఖ పురి భీంసేన్,నాయకులు మాడిశెట్టి వెంకటేష్, బోరే రాజయ్య పాల్గొన్నారు