కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ ) నందిగామ మండల పరిధిలోని బుగ్గోనిగూడ గ్రామంలో కాశీ అన్నపూర్ణ సామెత విశ్వేశ్వర స్వామి దేవాలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో షాద్ నగర్ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ ప్రజలతో కలిసి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, నరప్పగూడ గ్రామ మాజీ సర్పంచ్ కావాలి కృష్ణ ,మాజీ సర్పంచ్ వీరేందర్ గౌడ్ , గ్రామ ప్రజలు బుగ్గ సములయ్య , బుగ్గ శ్రవణ్ , బుగ్గ నర్సింహా , మాజీ సిగిల్ విండో డైరెక్టర్ మల్లేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల బుచ్చయ్య ,మంకల శ్రీశైలం ,ఆవుల శివ , సములయ్యా ,తాజా మాజీ వార్డు సభ్యులు భాస్కర్ గౌడ్ , గుండాల వేణుగోపాల్ , పబ్బే శ్రీశైలం , రవితేజ , లెంకపోతుల రవి గౌడ్ , నందిగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ చారి , మరియు నాయకులు , గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.