
పయనించేసూర్యుడు. న్యూస్.30.జనవరి. పుల్కల్ సంగారెడ్డి జిల్లా ఉమ్మడిపుల్కల్ మండలంలోని బొమ్మ రెడ్డి గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్డు స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొత్త ఆరో ప్లాంటు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అవసరమని విద్యార్థులు ,అధికారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి లక్ష సాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.