


పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలంలోని తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29 వ వర్ధంతి సందర్బంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల బోధన్ నియోజకవర్గంలోని పెంట కుర్దు జాడి మరియు ఎరాజ్పల్లి గ్రామాలలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ ప్రజలకు సేవ చేయాలన్న తపనతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలకే అధికారంలోకి వచ్చిన మహోన్నత శక్తి ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ అడ్హక్ కమిటీ కన్వీనర్ కోట గోపాల్ రెడ్డి, సిహెచ్ వి హనుమంతరావు, పావులూరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు ఈశ్వర్రావు, సుబ్బారావు, రామారావు, శ్రీనివాసరావు,కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి,గంగారం, సత్యనారాయణ, రావెళ్ల శ్రీనివాస్, భాస్కర్, సాయిబాబా సూరిబాబు, మోహన్ రావు, సచిన్ పటేల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమన సంఘం నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.