Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్భీంగల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్

భీంగల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్

Listen to this article

అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం
పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో

 

భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి.జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటా రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించడం చూసి మండలంలోని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గత పది సంవత్సరాలు పరిపాలించిన వీళ్లు దళితులను గిరిజనులను బడుగు బలహీన వర్గాలను అనేక రకాలుగా మోసం చేసి ఆస్తులు కూడా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు అది ఇవ్వలేదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ అన్నారు అది ఇవ్వలేదు కాలేశ్వరం పేరు లక్ష కోట్లు దోచుకున్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు అది లేదు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు అది లేదు దళిత బంధువు అన్నారు అది లేదు అట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని దరిద్రపు 10 సంవత్సరాలు బిఆర్ఎస్ కెసిఆర్ పాలన ధరణి తీసుకువచ్చి దళితుల భూములన్నింటినీ లాక్కున్న ఘనత గత కేసిఆర్ ప్రభుత్వానిదే ఇకపోతే బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ముందు అనేక కుల సంఘ భవన నిర్మాణాల కొరకు దొంగ ప్రొసీడింగులు ఇచ్చి కుల సంఘాలను ప్రజలను మోసం చేసిన ఘనత మీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి కే దక్కింది. అట్లాగే 1. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో 2.వేల్పూర్ మండలం అంక్సాపూర్లో 3.భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో మల్లన్న గుడిల మంజూరు కొరకు, 4మెండోరా మండలం సావేల్ గ్రామంలో మందిర నిర్మాణాల కొరకై కాంట్రిబ్యూషన్ కట్టించుకొని వాటికి ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి మంజూరు చేయించని ఘనత ప్రశాంత్ రెడ్డి కి దక్కింది. మీరు కాంట్రిబ్యూషన్ కట్టించి తప్పించుకున్న మా నాయకుడు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్చార్జి అయిన ముత్యాల సునీల్ కుమార్ వాటికి బిల్లులు ఇప్పిస్తున్నాడు అట్లాగే గత 2022 నుండి 2024 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ స్కీం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను కూడా ఇవ్వలేని ఘనత మీది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు పెండింగ్ లో పెట్టిన 80 వేల చెక్కులను చిత్తశుద్ధితో పేదలు నష్టపోవద్దని పెద్ద సహోదయంతో సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన ఘనత మాది మరి మా ప్రభుత్వం పెళ్లయిన నాలుగు నెలల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అట్లాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది. మా ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను గత మూడు నెలలుగా లబ్ధిదారులకు పంచకుండా తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే మీ ప్రశాంత్ రెడ్డి కాదా అని అడుగుతున్నాం అట్లాగే సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చే ఆర్థిక సాయం మీ ప్రభుత్వ కాలంలో మొత్తం 800 కోట్లు ఇస్తే, మేము వచ్చిన ఈ 14 నెలలోనే 830 కోట్లు ఇచ్చిన ఘనత మా సీఎం రేవంత్ రెడ్డి ది. మా పార్టీ గురించి గానీ మా ముఖ్యమంత్రి గురించి గానీ మా నాయకుల గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు మీకు ఏమాత్రం లేదు. ఇక ఇక్కడి మండల నాయకులు అయిన బిఆర్ఎస్ దొంగలు గురించి స్కీం కింద మంజూరైన ట్రాక్టర్లను గాని కోత మిషన్లను కానీ రైతులకు అందకుండా బిఆర్ఎస్ నాయకులు పంచుకున్న విషయాన్ని మండల ప్రజలు మర్చిపోలేరు, దళిత బంధు పథకాన్ని చోట మోట టిఆర్ఎస్ లీడర్లు పంచుకున్న విషయం, బీసీ బంధు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల పథకాన్ని లబ్ధిదారులకు కాకుండా,గ్రామాల్లో ఉన్న బిఆర్ఎస్ నాయకులు పంచుకున్న విషయం ప్రజలు మర్చిపోలేరు గతంలో భీంగల్ మండల కేంద్రానికి 400 కోట్లతో 1.సిరికొండ నుండి భీంగల్ కు 2.ఆర్మూర్ నుండి బడా భీంగల్ మీదుగా భీంగల్ కు.3.వేల్పూర్ హైవే నుండి భీంగల్ కు 4. మోర్తాడ్ నుండి భీంగల్ కు 5. కమ్మర్పల్లి నుండి భీంగల్ కు డబుల్ రోడ్లు మంజూరు చేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ ది మారుమూల మండలమైన ఇలాంటి అభివృద్ధికి నోచుకోని భీంగల్ మండలానికి డిగ్రీ కాలేజ్ సాంక్షన్ చేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ ది కనీసం మీ 10 సంవత్సరాల పాలనలో డిగ్రీ కాలేజ్ కు పక్క భవనం కూడా నిర్మించలేని దద్దమ్మలు మీరు మీ నాయకులు కనీసం ఆ కాలేజీ ముందల పావు కిలోమీటర్ రోడ్డు పోయించలేని దద్దమ్మలు మీరు మా గురించి మాట్లాడేది భీంగల్ మున్సిపల్ అభివృద్ధి కొరకు 11 కోట్ల 50 లక్షలు కార్పొరేషన్ కింద మంజూరు చేయించిన ఘనత ముత్యాల సునీల్ కుమార్ ది మీ రాక్షస పాలన వద్దని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇకనైనా దొంగ ధర్నాలు దొంగ దీక్షలు చేయడం మానేసి రాష్ట్రంలోని సంక్షేమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు పలికినట్టయితే రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మీపై విశ్వాసం అనేది కలుగుతుంది. అలా కాకుండా అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు.ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్.యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు.కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్.మండల యువజన అధ్యక్షులు అవినాష్.సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ దొనకంటి రాజేష్.ముచ్కర్ సొసైటీ చైర్మన్ దేవేందర్.మాజీ ఎంపీటీసీలు మూడేళ్ల అశోక్. ఏషాల కృష్ణ.వల్లి ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు రహిమాన్. జిల్లా కిసాన్ కేత్ కార్యదర్శి తోట శివ క్రాంతి.సురేష్.జాన్సన్.సాగర్.నవీద్.జిశాన్.కలీం.మీరాజ్. శ్రీను.నవీన్.సంతోష్.జనార్ధన్. రాము తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments