మంగళంపాడు చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
పయనించేసూర్యుడు ఆగస్టు 29 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మంగళంపాడు గ్రామ పరిధిలోని చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అక్రమాలను వెంటనే అధికారులు అడ్డు కోవాలని ప్రజలు కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మట్టి,రీచ్‌లలో దోపిడీ పెరిగిపోయిందని, అందులో వచ్చే నిధులు కొందరు అధికార పార్టీ నాయకుల జేబులకే వెళ్తున్నాయని విమర్శించారు.”ప్రభుత్వ అనుమతులు లేకుండా పగలు,రాత్రి అనే తేడా లేకుండా 24/7 లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు నుండి కొందరు రైతులు పేర్లు పెట్టి వ్యవసాయ పొలాలకి మట్టి తోలుకోవాలి అని చెప్పి తాత్కాలిక పర్మిషన్ తీసుకుని కోట్ల రూపాయలకు ఇండస్ట్రియల్ కంపెనీ తారకేశ్వర కి లేఔట్లకి మట్టిని గ్రావెల్, పెద్దపెద్ద టిప్పర్ లారీల ద్వారా తరలిస్తున్నారు దీనివల్ల చెరువు పరిసర ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారు. అధికారులు పట్టించుకోకుండా మౌనంగా ఉండటం దుర్మార్గం” అక్రమ తరలింపును వెంటనే నిలిపివేయాలి అక్రమార్కులపై చర్యలు చేపట్టాలి అలా చేయని యెడల ఆ చెరువులో భూమి స్వభావం మారిపోయి వర్షం పడ్డప్పుడు నీరు నిలవకుండా భూగర్భ జలాలు ఇంకిపోయి అక్కడ రైతులకి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఇప్పటికైనా *ఇరిగేషన్ శాఖ అధికారులు మైనింగ్ అధికారులు నిద్రవస్తునుండి మేల్కొని *అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు