
పయనించే సూర్యుడు జనవరి18(తుంగతుర్తి శాలిగౌరారం మాధవరెడ్డి)… నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల స్థాయిలో జాలోనిగూడెంలో సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో మాదారం గ్రామ క్రికెట్ అసోసియేషన్ మొదటి విజేతగా గెలిచి 15,000 రూపాయలు దక్కించుకోవడం జరిగింది. టీంలో అందరూ అద్భుతంగా రాణించి మాదారం గ్రామానికి మండల స్థాయిలో మంచి పేరు తెచ్చారు. క్రికెట్ క్రీడాకారులు నాని, మైబు, నజీర్, గజ్జి శంకర్, చింతల శంకర్,వినోద్,రవి,మధు, శివ,చేతన్, నరేష్,పండు, శ్రీకాంత్ శంకర్,లతీఫ్,లింగస్వామి,సమరం,ప్రదీప్, రమేష్,యకన్న చారి, వంశీ, జశ్వంత్, అనీఫ్, బాబా,శంకర్,మహేష్ లను గ్రామస్తులు అభినందనలు తెలియచేశారు భవిష్యత్తులో జిల్లా రాష్ట్ర స్థాయిలో మాధవరం గ్రామ క్రికెట్ అసోసియేషన్ రాణించాలని గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని గ్రామస్తులు కోరుచున్నారు.