
డాక్టర్ శిల్పా కు వినతి పత్రం అందజేశారు
సి ఆర్ గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 : మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు ఐదు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని సంబంధిత డాక్టర్ శిల్ప గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చాలీచాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు డ్రెస్ కోడ్ బ్లౌజులు ఇవ్వాలని గోవింద్ రాజ్ డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు ఇవ్వని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన లు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధు, భీమ్, బాలరాజ్, పవన్, నరేష్, మహబూబ్, జమ్ములమ్మ,సంధ్య, లక్ష్మి, నర్మద, జమ్మలమ్మ, తిప్పమ్మ, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.