
//పయనించే సూర్యుడు// ఆగస్టు 1//మక్తల్
మక్తల్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో భూ నిర్వాసితులు మాజీ సర్పంచ్ ఎంపిటిసి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు మేం చేస్తున్న పోరాటలకు న్యాయమైన పరిహారం పెంచేందుకై మద్దతు కోరనైనది. గత 20 రోజుల నుండి అనేక రూపాలలో రిలే నిరాహార దీక్షలు ధర్నాలు ఆందోళనలు నిర్వస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. మేము గొంతెమ్మ కోరికలు కోరలేదు మార్కెట్ ధరలకు అనుగుణంగా 50 లక్షల నుండి కోటి రూపాయలు వరకు భూములు కొంటున్నారు. ప్రభుత్వం మార్కెట్ యాల్వేషన్ కన్న తక్కువ 14 లక్షలు ఇస్తామనడం ఎంతవరకు సబవని మేం ప్రశ్నిస్తున్నాం. 2013 చట్టం ప్రకారం మూడంతలు పెంచి ఇవ్వాలని ఉన్నప్పటికీ ప్రభుత్వం దౌర్జన్యంతో భూములను లాక్కోవడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. భూమికి భూమి నా ఇవ్వాలి లేకుంటే న్యాయమైన పరిహారం ఇవ్వాలి. భూములను బేసిక్ ధర నిర్ణయించుటకు కమిషన్ ఏర్పాటు చేయాలి.కమిషన్ నిర్ణయించిన బేసిక్ ధరకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి.బలవంత భూసేకరణ ఆపాలి.ఈ కార్యక్రమంలో మాల నరసింహులు, కృష్ణ, మాల గజలప్ప, జిలాని, నారాయణ గౌడ్, మాల శివ, రాములు గౌడ్, బొంబాయి సోమన్న, అశోక్ గౌడ్, పెద్ద తమ్మన్న, సోమన్న, చిన్న తమ్మన్న తదితరులు పాల్గొన్నారు
