
పయనించే సూర్యుడు న్యూస్ 31 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ
గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన పత్తెం సత్యనారాయణ “ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లింగ్వా ఫ్రాంకా: లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ఇంటర్‌కల్చరల్ కమ్యునికేషన్ కోసం చిక్కులను అన్వేషించడం” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను రాజస్థాన్ కు చెందిన సన్ రైజ్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. పత్తెం సత్యనారాయణ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రాజ్ గోపాల్ సింగ్ చౌహన్ పర్యవేక్షణలో పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. పత్తెం సత్యనారాయణ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా పత్తెం సత్యనారాయణ ను మల్లారెడ్డి పేట గ్రామస్తులు అభినందించారు.