Sunday, March 2, 2025
Homeతెలంగాణమహాత్మాగాంధీ విగ్రహానికి 420 హామీలు - 420 రోజులపై అప్లికేషన్ ఇచ్చినా మండల బిఆర్ఎస్ నాయకులు..

మహాత్మాగాంధీ విగ్రహానికి 420 హామీలు – 420 రోజులపై అప్లికేషన్ ఇచ్చినా మండల బిఆర్ఎస్ నాయకులు..

Listen to this article
పయనించే సూర్యుడు జనవరి 30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా.కాంతారావు  మరియు  అశ్వారావుపేట మాజీ శాసన సభ్యులు నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మెచ్చానాగేశ్వర రావు  ఆదేశాల మేరకు అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు గల మహాత్మా గాంధీ  విగ్రహానికి అప్లికేషన్ అందజేసిన మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, డిక్లరేషన్ల  హామీల పేరుతో గ్యారంటీల తో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మాటల రూపంలో ఇస్తుంది కానీ చేతల రూపంలో చేయలేక పోతుందని
అధికారం చేపట్టిన వెంటనే మొదటి వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి.. 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనా సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు.
బి ఆర్ ఎస్ ప్రభుత్వ లోఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని గత 4 సంవత్సరాల క్రితం మన అశ్వారావుపేట మండలంలో సుమారు 1530 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, 2021 లో  మా కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ బట్టి విక్రమార్క  పాల్గొన్న విషయం కూడా మార్చిపోయారని, అలాగే అంతకు ముందు కుటుంబానికి 20 కేజీలు ఉన్న పరిమితిని ఎత్తివేసి,ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కేజీలు ఇచ్చెల్ పథకాన్ని అమలు చేశామని,మా కెసిఆర్  ప్రభుత్వంలో రాష్ట్రం లో కొత్తగా 6,47,479 నూతన రేషన్ కార్డులు జారీ చేయటం జరిగిందని అన్నారు. అలాగే కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ ని, కోట్ల ప్రజా ధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్దాలు  పలికి ఇప్పటి వరకు వారికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేక పోతున్నారని,
కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 100 శాతం చేయకుండానే రుణమాఫీ అవిపోయిందని చెప్తున్నారని,రైతు కూలీలకు 12 వేలు ఇస్తాం అని ఇప్పుడేమో 20 రోజులు ఐన పని చేసి ఉండాలి అని చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని,
అలాగే అప్పుడు రైతు బంధు 10 వేలు బిక్షం అన్న రేవంత్ రెడ్డి రైతుబంధు ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయలేదన్నారు
 అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనేల చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని,
గురుకులాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కల్తీ ఆహారం తిని విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, ప్రతి రోజూ ఏదో ఒక గురుకులంలో గానీ ప్రభుత్వ పాఠశాలలో గాని కల్తీ ఆహారం వలన విద్యార్థులు అనారోగ్యాల భారిన పడుతున్న,చనిపోతున్న మీ ప్రభుత్వం దీనిని నివారించడంలో పూర్తిగా విఫలం ఐన తీరు మీ పాలనకు మి చేతకాని తనానికి నిదర్శనం అని మండల నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు మండల కార్యదర్శి జుజ్జూరపు.వెంకన్న బాబు  టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ మాజీఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి వగ్గేల పూజ మందపాటి మోహన్ రెడ్డి  సీమకూర్తి.వేంకటేశ్వర రావు జుజ్జురపు శ్రీరామమూర్తి, చిప్పనపల్లి బజారయ్య తాళం సూరి ధర్మా వెంకన్న బాబు బుజ్జిబాబు గుప్తా గుడవర్తి.వేంకటేశ్వర రావు,సోమని.రమేష్ శెట్టిపల్లి రఘురాం శ్రీరామమూర్తి జోసెఫ్  యువజన విభాగం మోటూరి మోహన్ కలపాల సురేష్ తగరం హరి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments