
*అహింస,శాంతియుత పోరాటం
ద్వారా హక్కులను పొందగలం
మార్గం చూపిన మహనీయుడు
బాపూజీ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, జనవరి 30 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)
జాతిపిత,మహనీయులు మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మాక్తా మహబూబ్ పేట్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిం చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మె ల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …..అ హింస,శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందగలం అనే మార్గం చూపిన మహనీ యుడని,మాన వాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహా త్మాగాంధీజీ ఒక రని,ఆయన మనకు అహింస,సత్యాగ్ర హం అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి, వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపిం చిన గొప్ప వ్యక్తి అని అన్నారు,మహాత్మా గాంధీ ఆశయాలు,జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అవ్వాలని,అట్టడగు వర్గాల వారికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుకున్నారని,గ్రామస్వరా జ్యం వస్తేనే దేశం అన్ని విధాలుగా అభి వృద్ధి చెందుతుందని ఆలోచించిన మహ నీయుడని కొనియాడారు,ఈ కార్యక్రమం లో రాఘవేంద్రరావు,నాగుల్ గౌడ్,లక్ష్మణ్ ముదిరాజ్,గ ణేష్ ముదిరాజ్,రాజేష్గౌ డ్,శ్రీనివాస్,రామకృష్ణారెడ్డి,శివరాం,వినోద్ యాదవ్,సురేష్ ముదిరాజ్,మాన్యం,
రాము,శివారెడ్డి, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.