పయనించే సూర్యుడు గాంధారి 30/01/25
టీజీబీ వదం శాతం ప్రభుత్వరంగ బ్యాంకు..
– బ్యాంకు జనరల్ మేనేజర్ వి.అనిల్
గాంధారి:
తెలంగాణ గ్రామీణ బ్యాంకు వదం శాతం ప్రభుత్వరంగ బ్యాంకు అని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ వి.అనిల్ అన్నారు. నూతన భవనం లోకి మార్చిన టీజీబీ గాంధారి బ్రాంచ్‌ను ముఖ్య అతిధిగా విచ్చేసి నిజామాబాద రీజనల్ మేనేజర్ పి.నవీన్ కుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం సేవక సంఘాల మహిళలు, ఖాతాదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ బ్యాంకు అనగానే చాలా మందిలో ప్రైవేటు బ్యాంకు అనే అపోహ ఉంటుందన్నారు. ఇందులో 50 శాతం కేంద్ర ప్రబుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 35 శాతం ఎస్‌బీఐ వాటా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న బ్యాంకులతో పోలిస్తే తెలంగాణ గ్రామీణ బ్యాంకు దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. డ్వాక్రా మహిళలలకు ఎక్కువగా రుణాలు అందించే బ్యాంకుగా నిలిచామన్నారు. మహిలలు తాము పొందిన రుణాలతో ఆర్ధికంగా ఎదిగేలా వ్యాపారాలు చేసుకుని బలోపేతం కావాలని సూచించారు. సకాలంలో తిరిగి చెల్లించే సంఘాలకు రూ.2 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ పరిధి లోని 289 మహిళా సంఘాలకు సంబంధించిన రూ.35 కోట్ల రుణాల చెక్కులను, ఒక కార్ లోన్ చెక్కును, రూ.60 లక్షల విలువైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం రుణాలు, పీఎం జీవన జ్యోతి భీమా కింద రూ.2 లక్షల చొప్పున ముగ్గురికి, ఒకరికి ప్రమాదభీమా కింద రూ.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం రవీందర్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, టీజీబీ ఎస్‌ఎంవో అజయ్, ఎస్‌ఎంబీ ఎం.అనిల్, స్ధానిక బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, డివిజన్ పనిధిలోని ఆయా టీజీబీ శాఖల మేనేజర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రుణాల చెక్కులను అందజేచేశారు
RELATED ARTICLES