
పయనించే సూర్యుడు, ప్రతినిధి (శ్రీరామ్ నవీన్), తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్ కేంద్రంలో, రోడ్డు దాటుతూ వ్యాపారి, ఛాంబర్ అఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు పట్టణం కు చెందిన, ఛాంబర్ అఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు రేగూరి నర్సయ్య(74) తన ఇంటివద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొనడం తో తీవ్రంగా గాయాలవడం తో పట్టణం లోని ప్రవేటు ఆసుపత్రి కి తీసుకోని వెళ్లారు. మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి తరలించి వైద్యం చేస్తుండగా నర్సయ్య మృతి చెందాడు.ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్, ప్రధాన కార్యదర్శి తల్లాడ హీరాధార్ లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం, కిరాణా వర్తక సంఘం ఫంక్షన్ హాల్స్ సంఘం, పలువురు నాయకులు పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు తెలిపారు.పట్టణం లో వ్యాపార వర్గం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.పలువురు వ్యాపారస్తులు, వివిధ వర్గాల ప్రజలు, నివాళులు అర్పించారు