
నారాయణఖేడ్ నియోజకవర్గంలో దస్తగిరి రిపోర్టర్,పయనించేసూర్యుడు18-1-2025
ప్రెస్ నోట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ని కలిసినా మాజీ మేయర్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ .. ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. 13 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఊకదంపుడు ప్రసంగాలే తప్ప చేసింది ఏమీలేదని మండిపడ్డారు .
గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోగా, నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు ఉద్యోగాల భర్తీతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. గత డిసెంబరు 9వ తేదీన ఇచ్చిన హామీ మేరకు రైతుకు రూ.2లక్షలు అమలు చేయకపోవడంపై విద్యావంతులైన యువత ఆలోచించాలని కోరారు.
కేవలం ఐదు నెలల్లో రైతు సమాజమే కాకుండా వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లు, అనేక ఇతర వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
రెండు వేతన సవరణ కమీషన్ల ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యధిక వేతనాలు (73%) ఎలా పెంచిందో గుర్తుచేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్‌ఎస్‌కు దూరం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం కూడా పదేళ్లలో 2 లక్షల ఖాళీలను భర్తీ చేసిందని, అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత (1) ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
నేతలు, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.