పయనించే సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి 1 మక్తల్:- మాధ్వార్ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలో ఫిబ్రవరి 3 తారీకు నుండి 6 తారీకు వరకు జరిగే శ్రీ శ్రీ గట్టు తిమ్మప్ప జాతర మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని మక్తల్ శాసనసభ సభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు సోమవారం రోజు ఉదయం 8 గంటల కు రాజేశ్వరరావు ఇంటి నుండి శ్రీ వెంకటేశ్వర . లక్ష్మి. పద్మావతులు. ఉత్సవ మూర్తులు బయలుదేరి గ్రామంలో శ్రీ సాయి సంగీత కళాబృందం చే బాలికల కోలాటం మరియు అడుగుల భజనతో గుట్ట దగ్గరకు చేరుకుందురు అక్కడ కృష్ణానది నుండి తెచ్చిన జలాలతో స్వామివారికి అభిషేకము జరుగును సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం జరుగును మరియు రాత్రికి భజన చేయుదురు. మంగళవారం ఉదయం 9 గంటలకు మాధ్వార్ గ్రామం నుండి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీహరి. దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి భాజా భజంత్రీలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు . అలాగే 10 గంటలకు మాధ్వార్ గ్రామ యువకులు . రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. అలాగే మాధ్వార్ గ్రామ . వివేకానంద యూత్ మండలి వారిచే చలివేంద్రం నిర్వహిస్తారు . 11:30 నిమిషాలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం అలాగే దివ్యమైన క్షేత్రాలు పద్మావతి అమ్మ వారి దేవాలయం అలాగే . శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ.వారి మఠం దర్శించుకోగలరని కోరుతున్నాము . మధ్యాహ్నం 3 గంటల నుండి బాలికలచే దాండియా నృత్యం అడుగుల భజన కోలాటం ఉంటుంది సాయంత్రం 5 గంటలకు స్వామివారి రథోత్సవం . రాత్రి 9 గంటలకు సాంప్రదాయ నృత్యం కూచిపూడి నాట్య ప్రదర్శన మక్తల్ వారిచే మరియు మిమిక్రీ దాండియా సాంస్కృతిక కార్యక్రమాలు డాక్టర్ వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ప్రారంభించదురు .బుధవారం సాయంత్రం ఐదు గంటలకు పాలవుట్ల కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు శివ స్వాముల రుద్రాభిషేకం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవాల జరిగే ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని
సంప్రదాయ నృత్యం కూచిపూడి నాట్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు జాతర సందర్భంగా నిర్వహిస్తున్నారని కావున మక్తల్ మండలం తో పాటుగా తదితర గ్రామాల వారు వచ్చి మా జాతర మహోత్సవాలను తిలకించగలరని గ్రామ పెద్దలు. రాజేశ్వరరావు . మాజీ ఎంపిటిసి సంతోష్ రెడ్డి . గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి . వడ్ల శ్రీనివాసు.ఎం ఆశప్ప . బి శంకరప్ప . వి సత్యప్ప . కే బ్రహ్మయ్య . జి రాములు . వెంకటేష్ గౌడ్ . బి విశ్వనాథ్ . కురువ వెంకటరమణ . గంజి గోవిందప్ప గణపురం వెంకటప్ప . బి బాలు . గుంటనోల బాలకిషన్ .పేట సౌరప్ప . ఎర్రంకుల లక్ష్మయ్య . చిన్నూరు లక్ష్మన్న . పేట ఎల్లప్ప . గుడిసె ఎర్ర తాయప్ప . పేట అంజప్ప గ్రామస్తులు గ్రామ భక్త ప్రజలు కోరుతున్నారు .