
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ .యూసుఫ్ పయనించే సూర్యుడు.జనవరి. 30
అశ్వాపురం లో ఎక్కడబడితే అక్కడ బెల్ట్ షాపులు, అధిక రేట్లకు అమ్మకాలు….బెల్ట్ షాపులకు అక్రమ మద్యం సరఫరా చేయడానికి అశ్వాపురం లో మద్యం సిండికేట్ పాయింట్లు.. ఒక్కొక్క కోటరుకు సిండికేట్ లో 20 రూపాయలు వసూలు, ఇదే అదునుగా బెల్ట్ షాపులో ఒక్కొక్క కోటరుకు 40 రూపాయలు వసూల్..అశ్వాపురం మండలంలో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల్లో మందు దొరకదు, బెల్ట్ షాప్ లో మాత్రం అన్ని దొరుకుతాయి…అశ్వాపురం మండలం లో అధిక రేట్లకు అక్రమమధ్యం సరఫరా? అశ్వాపురం మండలం లో ప్రతి ఒక్క మద్యం దుకాణం నుంచి ప్రతిరోజు మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులకు అక్రమ మద్యం సరఫరా….అశ్వాపురం మండలంలో కొన్ని కొన్ని చోట్లలో ఏజెన్సీ ప్రాంతంలో అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని లూజుమధ్యం కూడా సరఫరా?ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న? ఇప్పటికైనా స్పందించి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని స్థానికులు కోరుకుంటున్నారు