
పయనించేసూర్యుడు,జనవరి 17,కాప్రా ప్రతినిధి సింగం రాజు:మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ ఓల్డ్ మీర్పేట్ ఎన్టీఆర్ నగర్ లో శుక్రవారంమున్సిపల్ అధికారులతో కలిసి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయమై బండబావి స్థలాన్ని సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్,పన్నాలదేవేందర్ రెడ్డి.ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇంత విశాలమైన స్థలం ఉందని,ఈ స్థలం అభివృద్ధి దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులతో చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ గతంలో రోనాల్డ్ రాస్ బృందం సందర్శించిందని గుర్తు చేశారు.మల్లాపూర్ బండబావి ప్రాంతంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో సహకారం అందించాలని కోరారు.మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సంబందించిన లెటర్స్ అన్ని జోనల్ కమిషనర్ కి ఎస్ఈకి అందించామని ఈవిషయంలో సహకారం అందిస్తే స్థానిక ప్రజలకుఎంతోఉపయోగంగా ఉంటుందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి,ప్రాజెక్ట్స్ నుండి డీఈ రవీందర్,డీఈ ఉమా మహేశ్వరి,మెయింటెనెన్స్ నుండి డీఈ రూప,ఏఈ లింగారావు,ఏఈ భారత్, వర్క్ ఇనస్పెక్టర్ చారి స్థానిక నాయకులు కటార్ల భాస్కర్,నరసింహ గౌడ్, భానురి రాకేష్,వేణు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, వెంకటచారి,రామకృష్ణ,వాసు చారి,రంగు ప్రసాద్,రాజు, శ్రీనివాస్,శ్యామ్,విజయ్, అంజి,నిసార్ అహ్మద్ గోరి, సంజయ్,కృష్ణ,ప్రవీణ్, శ్రీశైలం,తదితరులు పాల్గొన్నా