
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫరూక్నగర్ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ మరియు డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్
యువ నాయకులు రాజు నాయక్ గ్రామ సెక్రెటరీ జంగయ్య
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ముగిసింది ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో రవీందర్ టీం తో ప్రవీణ్ టీం తలపడగా రవీందర్ టీం విన్నర్గా నిలవడం జరిగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులను క్రీడలలో రాణించాలని తద్వారా శారీరక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందితుందని తద్వారా తమ లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుందని యువకుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు యువకులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు అదేవిధంగా యువకులు గ్రామస్థాయిలోనే కాకుండా వివిధ స్థాయిలో ఆడాలని దానికి తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫరూక్నగర్ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ కడియాల కుంట తండా గ్రామ సెక్రెటరీ జంగయ్య డిప్యూటీ సర్పంచ్ మనీ రెడ్యానాయక్ మరియు యువ నాయకులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు