
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, ఆదోని రూరల్ రిపోర్టర్
కర్నూలు జిల్లా ఆదోని మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాంజల చెరువులను పరిశీలించడం జరిగింది.
గత కొన్ని నెలల క్రితం మున్సిపల్ అధికారులు చెరువును శుభ్ర పరిచడం జరిగింది .అయినప్పటికీ కొంతమంది ప్రజలు చెరువులో వ్యర్థాలను అలాగే పడేయడంతో చెరువు మళ్ళీ చెత్త చెదారంతో మరియు పిచ్చి మొక్కలు నిండుకొని పోయిందని ,చెరువును శుభ్రపరచాలని అదే విధంగా అక్కడ బోర్డును కూడా ఏర్పాట్లు చేయాలని ఆదోని మున్సిపల్ కమీషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షలు సురేష్ కుమార్ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దయచేసి ప్రజలు త్రాగునీటి చెరువులో వ్యర్థాలను పడేసి తాగునీటిని కలుషితం చేయవద్దను ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కోర్దినేటర్ కన్నా రాజశేఖర్ సభ్యులు కిరణ్ రమేష్ మహేష్ ఉసేని తదితరులు పాల్గొన్నారు చెరువు రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మానవ హక్కుల పరిరక్షణ సమితి