ముమ్మిడివరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్

June 26, 2026 | తెలంగాణ

పయ నించే సూర్యుడు జూన్ 26 🙁 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ప్రజా సమస్యల పరిష్కార వేదిక – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలోని ముమ్మడివరం శాసన సభ్యుల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు.శాసనసభ్యుల అర్జీలను పరిశీలించి, తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు.మరిన్ని సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper