
పయనించే సూర్యుడు మార్చి 31 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు :రంజాన్ పండుగ ముస్లీం మతస్థులకు అతిపెద్ద పండుగ.నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని ఆయన గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని కలెక్టర్ అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు.