
పయనించే సూర్యుడు మార్చి 27 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు :ఇల్లందుసిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రిలే నిరాహార దీక్ష గురువారానికి మూడో రోజుకు చేరింది ఈ దీక్షలను సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ లు మాట్లాడారు. గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న పేదల సమస్యను పరిష్కారం అయ్యే దిశగా అధికారులు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పందించాలని అన్నారు, గత అరెళ్ళు గా ఇండ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు, ఆందోళలను చేస్తున్న గాని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించడం సరికాదని అన్నారు. ఈ సందర్బంగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను నిర్ణయిస్తామని ఉద్యమం రూపం మారుస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో సిపిఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేష్, ఆర్ బి జె రాజు,వీరభద్రం, సంతోష, సుజాత, కమల, హుస్సేన్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.