
పయనించే సూర్యుడు 15 మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా,,ఈరోజు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ ఆధ్వర్యంలో,వేల్పూర్ మండలం లక్కోర లో పీకే టి పి బీడీ సెంటర్ లో బీడీ ప్యాకర్స్ బీడీ కార్మికులతో,అట్లాగే కొత్తపల్లి లో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది,, ఈ సందర్భంగా,, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ జిల్లా నాయకులు జి.అరవింద్ మాట్లాడుతూ,,మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ,139 సంవత్సరాల క్రితం కార్మికులు కొట్లాడి 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు 10 నుండి 12 గంటల వరకు పెంచడం సరైంది కాదు అని కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియ చేశారు,, కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేస్తూ 29 చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా తీసుకువచ్చి ఆదాని అంబానీలకు యజమానికి అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చేయడం సరైనది కాదని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు,, అదేవిధంగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని పిఎఫ్ ఈ ఎస్ ఐ ౌకర్యం కల్పించాలని సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని,, కోరారు సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9000/-రూ”లు ఇవ్వాలని పాత పెన్షన్ పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ ఆపాలని ,, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయల కూలి చెల్లించాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని కోరుతూ ఈనెల మే 20 తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కొరకు కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టి యు సి ఐ గా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో,, బీడీ ప్యాకర్స్ బీడీ కార్మికులు పి.గంగాధర్, డి.లింబాద్రి , ఎన్.అన్వర్ , జి.పద్మ, ఆర్.హేమలత, కే.సాయన్న, ఏం.రాజేందర్, పి.ఆనంద్ , కే.కావేరి, ఎం. జ్యోతి, డి.మనిషా, ఆర్.మురళి, ఎన్.రమేష్ , ఏ. స్రవంతి, ఆర్.జగదీష్ , జి.రెడ్డన్న, వి బుచ్చి రాములు, ఈ హనుమన్లు, రూపా, ఆరే.గౌతమి, హరి శోభ, ఆర్య నర్సు , అక్కినపల్లి వర్షిని, యన్. దేవరాజు, ఎలేటీ. జ్యోతి, యo. గoగామణి, టి. లక్ష్మి, ఎ. మధులత , తదితరులు పాల్గొన్నారు,,
