
పయనించే సూర్యుడు మే 15 టేకులపల్లి ప్రతినిధి( పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం కొసం ఇల్లందు సింగరేణి కార్మిక సంఘాల జేఏసి ఆద్వర్యం లో టేకులపల్లి మండల కోయగూడెం ఓసీ నందు పిట్ మీటింగ్ బీ బాలాజీ అద్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు సంఘాల నేతలు నజీర్ అహ్మద్, అబ్దుల్ నబి,నాగేశ్వరరావు, బయ్యా వర ప్రసాద్ లు పాల్గొనీ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకు ఆకులంగా పనిచేస్తున్నారని కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని,29కార్మిక చట్టాల స్థానే 4లేబర్ కోడ్ లు తెచ్చారని దానికి వ్యతిరేకంగా జరిగే దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సార్వత్రిక సమ్మె నరేంద్ర మోదీ కి చెంప పెట్టుకావాలని కార్మిక చట్టాలను రక్షణ కోసం, సింగరేణి మనుగడ కొసం జరిగే సమ్మె లో కార్మికులు పాల్గొన్ని విజయవంతం చేయాలని సమ్మె విజయవంతం కొసం అన్ని గనులపై, డిపార్ట్మెంట్ లపై పిట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు కోయగూడెం ఓసీ నందు పిట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అని జేఏసీ నేతలు తెలిపారు ఈ సమావేశంలోకార్మిక సంఘాల జెఏసి నాయకులు కే వీరన్న, గూగులోత్ కృష్ణ, షేక్ సర్వర్,రాంబాబు, బాసు తదితరులు పాల్గొన్నారు