
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ లో దాసరి రాహుల్ ప్రదీప్ బుల్లెట్ రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మైత్రి కన్స్ట్రక్షన్స్ లిజనింగ్ వర్క్స్ ఆఫీస్ ను శనివారం స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. వారిరువురిని మైత్రి కన్స్ట్రక్షన్ యాజమాన్యం శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులుగా సమాజ శ్రేయస్సు కై పనిచేస్తూ మరొక అడుగు ముందుకు వేస్తూ కన్స్ట్రక్షన్స్ లిజనింగ్ వర్క్స్ ఆఫీసును ప్రారంభించి, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో కన్స్ట్రక్షన్స్ లోన్లు ఇప్పించి మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రాంతాన్ని ఎంచుకొని ఇలాంటి ఆఫీసు ఓపెన్ చేయడం సంతోషకరమని, ఆఫీస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో శ్రేయోభిలాషి తెల్ల హరికృష్ణ ఆల్విన్ కాలనీ డివిజన్ కి సంబంధించిన వివిధ రాజకీయ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీ వాసులు, మహిళా నాయకురాలు, మిత్రులు శ్రేయోభిలాషులు జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.