
పయనించే సూర్యుడు (న్యూస్) మక్తల్ జనవరి 17( రిపోర్టర్ సి తిమ్మప్ప)… 19 జనవరి 2025 ఆదివారంటూ నాడు మహబూబాబాద్ పెరల కట్టయ్య భవన్ వేదిక గా జరుగు రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయలని మున్సిపల్ కార్మికుడు టి యు సి ఎల్ వైస్ ప్రెసిడెంట్ మక్తల్ బండారి రవి పిలుపునిచ్చారు
కార్మికులకు కల్పించిన హక్కులు లో భాగంగా పంజాబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ సుప్రీంకోర్టు లో వేసిన రిట్ పిటిషన్ ఒకే పనికి ఎక్కువ ,తక్కువ వేతనాలు ఇవ్వరాదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు కు అనుగుణంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కు వేతనాలు అందివ్వాలని పలు డిమాండ్ల తో రాష్ట్ర మహాసభల నిర్వాణ తల పెట్టడం జరిగింది కోరారు మునిసిపాలిటీ రంగం లో పని చేస్తున్న కార్మికులు పొందుతున్న వేతనాలు నేడు పెరిగిపోతున్న ధరలతో జీవన బ్రతుకు బండి కష్టతరం అవుతున్నది వీటన్నిపై రాష్ట్ర మహాసభలు చర్చించ డానికి మేధావులు హాజరు అవుతున్నారు అని ఈ మహా సభలు విజయవంతం చేయడానికి ప్రజలు,అసంఘటిత కార్మికులు,రైతాంగ కూలీలు వేలాదిగా తరలి రావాలని కోరారు కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్,తదితర రూపాల తొలగించి అన్ని రకాల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని పి ఎఫ్, ఈ ఎస్ ఐ సక్రమంగా అమలు తదితర డిమాండ్లతో సభ లో మేధావుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని బండారి రవి కోరారు