
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి రాష్ట్ర రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టించిన తెలుగుతేజం అన్న ఎన్టీఆర్ అని పలువురు వక్తలు కొనియాడారు . మండల కేంద్రమైన కంచికచర్లలో శనివారం స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు నాయకత్వంలో ఘనంగా జరిగాయి. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయానికి ఎదురుగా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చారన్నారు. పేదలకు కూడు ,గుడ్డ ,నీడ కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. దేశంలోనే సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ నిలిచారన్నారు. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి టీడీపీని బీసీల పార్టీగా గుర్తింపు తెచ్చారన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నన్నపనేని నరసింహారావు , ఏఎంసి మాజీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ,పార్ట్ సీనియర్ నాయకులు డాక్టర్ పుల్లగూర ప్రభాకరరావు,వేమా వెంకటరావు, గుత్తా రత్నం , కాకతీయ యూత్ సభ్యులు రఘు ,వాసు ,శేషు, జాస్తి సురేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.