పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 31అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
మండల కేంద్రమైన అనంతసాగరంలోని శుక్రవారం యుటిఎఫ్ కార్యాలయానికి రిటైర్డ్ పిఎస్ హెచ్ఎం యుటిఎఫ్ సీనియర్ నాయకులు పాపిశెట్టి నరసింహులు21000 విలువ కలిగిన కంప్యూటర్ బహుకరణగా అందజేసి ఆవిష్కరించారు. అనంతరం యుటిఎఫ్ మండల సమావేశం జరిగినది. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి హెచ్ మోహన ప్రసాద్ మాట్లాడుతూ 117 వ జీవో వలన ప్రాథమిక పాఠశాలలు మునుగుడే ప్రశ్నార్థకమన్నారు. ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ మండల యుటిఎఫ్ ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పాపిశెట్టి నరసింహులు కృతజ్ఞతలు అన్నారు. మహిళా కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ హిందూ పాఠశాలలను దాతలు, తన సొంత నిధులతో 60 మంది విద్యార్థుల నుంచి 210 మంది విద్యార్థుల సంఖ్య పెంచి పాఠశాలకు పాపిశెట్టి నరసింహులు గుర్తింపు తీసుకొచ్చారని ఆమె కొనియాడారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్ దాత పాపిశెట్టి నరసింహులు మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘం వలన మనం ఈ స్థాయిలో ఉన్నామని సంఘానికి ఎంత చేసినా తక్కువేనని ఆయన అన్నారు. మండల యూటీఎఫ్ అధ్యక్షులు వద్దిబోయిన వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక ప్రైమరీ పాఠశాలలను రద్దు చేయడం తగదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పాపిశెట్టి నరసింహులను యుటిఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు వల్లి అహ్మద్, మహబూబ్ బాషా, కృష్ణయ్య, నాయబ్, గౌస్ బాషా, పెన్షన్ సంఘం నాయకులు ఖాజా మొహిదీన్, తదితరులు పాల్గొన్నారు.