
అభినందలు తెలిపిన ఎంఎల్ఏ..నానాజీ పయనించే సూర్యుడు ఫిబ్రవరి 9, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)
కాకినాడ రూరల్ మండలం రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సూరంపూడి కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా శుక్రవారం నూతన కమిటీ తో కలసి ఆయన స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి గజమాలాతో సత్కరించారు. ఈసందర్భంగా ఎంఎల్ఏ నానాజీ నూతన అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. డీలర్స్ అసోసియేషన్ కి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలకు మేలు చేసే విధంగా నూతన కమిటీ పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూరంపూడి కిషోర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో, పెద్దల సూచనలతో కమిటీకి మంచి పేరు వచ్చేలా పని చేస్తామని డీలర్ల సమస్యలు పరిష్కరించే విధంగా నూతన కమిటీ పనిచేస్తుందని అదే సమయంలో ప్రజలకి సేవల విషయంలో నిస్వార్థంగా పని చేస్తామని అన్నారు. నూతన అసోసియేషన్ ప్రెసిడెంట్ ను మాజీ అధ్యక్షుడు కోటిపల్లి శ్రీనివాస్, రూరల్ మండలంకు చెందిన డీలర్లు అభినందించారు. అనంతరం యువ నాయకులు పంతం సందీప్ ను నూతన కమిటీ ఘజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండలం రేషన్ డీలర్స్ సభ్యులు పాల్గొన్నారు.