
పయనించే సూర్యుడు తేదీ జనవరి గాజులరామారం రిపోర్టర్: ఆడేపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)… జంట సర్కిల్లలో రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులు లేని వారి వివరాలను పౌరసరఫరాల శాఖ నుంచి సేకరించారు సంబంధిత జాబితా ఆధారంగా ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. గాజుల రామారం సర్కిల్ల ఉప కమిషనర్లు వడ్డేపల్లి నరసింహ, మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 20 లోగా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.
జంట సర్కిళ్లలో చాలామంది స్థానికేతరులే నివాసం ఉంటున్నారు వారు వివిధ పరిశ్రమల్లో పనిచేసి జీవనోపాధి పొందుతున్నారు కొన్ని కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి!దీంతో వారంతా తమ ఇళ్లకు తాళాలు వేసి ఉదయం 9 గంటలకే విధులు నిర్వర్తించడానికి వెళ్లాల్సి రావడంతో కుటుంబ సర్వేలో వారి వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం చిక్కలేదు.. కుటుంబ సర్వే వద్దని సంబంధిత సిబ్బందిని వెనక్కి పంపిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా వివరాలు నమోదు చేసిన వారిలో.. నుంచే అర్హులను ఎంపిక చేసి రేషన్ కార్డులు ఇవ్వడానికి కసరత్తు చేస్తుండడంతో వివరాలు నమోదు చేయని వారిలో అయోమయం నెలకొంది.