పయనించే సూర్యడు జనవరి 29 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లుపైలెట్ ప్రాజెక్టు గ్రామాల రైతులకే రైతు భరోసా అందించడం తగదని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ అన్నారు. బుధవారం నడిగూడెంలో పాత్రికేయలతో మాట్లాడుతూ 70 లక్షల మంది రైతులు ఉంటే, 5 లక్షల మందికే రైతు భరోసా నిధులు విడుదల చేసి మిగిలిన రైతులకు అన్యాయం చేశారన్నారు. పైలెట్ పైలెట్ ప్రాజెక్టు గ్రామాలకు రైతు భరోసా అందించి మిగిలిన గ్రామాలలో సన్న,చిన్న కారు రైతులు పరిస్థితి ఏమిటన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు.
రైతు భరోసా పైలెట్ ప్రాజెక్టు గ్రామాలకేనా
RELATED ARTICLES