
పయనించే సూర్యుడు జనవరి 21 ( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి):పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పునుకుల గ్రామానికి చెందిన మనోహర్(32) ఇతను కేటిపిస్ ప్లాంట్ ఐదవ స్టేజ్ లో ఆర్టీజెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళ వారం నాడు ఉదయం డ్యూటీ నిమిత్తం బయలు దేరి కరక వాగు సమీపం లో ఉన్న బంజారా కాలనీ వద్ద గల రైల్వే ట్రాక్ పై గూడ్స్ ట్రెయిన్ కింద తల పెట్టి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఆత్మ హత్య కు గల కారణాలు తెలియ రాలేదు. కొంత మంది కుటుంబ కలహాలు వల్ల ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలానికి పెద్ద ఎత్తున జనం గుమ్మి గూడినారు.కే టీ.పీ.ఎస్ ప్లాంట్ ఎ. డీ వచ్చి సంఘటన స్థలం లో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి శ్రద్ధాంజలి ఘటించారు. రైల్వే పోలీసు లు,పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్. ఐ , పోలీసులు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కొత్త గూడెం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపు తామని పట్టణ ఎస్ ఐ సుమన్ తెలిపారు.