
పయనించే సూర్యుడు మార్చి 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల తాసిల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించి ఈ సమావేశంలో మండలంలోని రేషన్ షాపు డీలర్లతో తాసిల్దార్ మురళి మాట్లాడుతూ చేజర్ల మండలం రైస్ కార్డుదారులు ఈకేవైసి చేసుకొని వారు ఈకేవైసీ చేయించుకోని కార్డులు తొలగించుటకు అవకాశంకలదు, అందరూ కార్డుదారులు డీలర్ , వీఆర్వో వద్ద వెంటనే ఈకేవైసీ చేయించుకొని ఈ అవకాశాన్ని రైస్ కార్డ్ దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో మండలంలోని అన్ని రేషన్ షాప్ డీలర్లు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు