
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో రాత్రి ఒక యువకుడు మృతి చెందాడు వివరాల్లోకి వెళితే టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన అజ్మీర శివ కుమారుడు అజ్మీర అశోక్ 34 రాత్రి టేకులపల్లి నుంచి సులానగర్ ఇంటికి qవెళ్తున్నాడు ఈ క్రమంలో టేకులపల్లి లారీ ఆఫీస్ వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్ qబ్రేక్ వేయడంతో వెనుక ఉన్న బైక్ లారీని ఢీ కొట్టింది దీంతో అశోక్ తీవ్ర గాయాలయ్యాయి వెంటనే హుటాహుటిన కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మి ఇల్లందు నియోజకవర్గ నాయకుడు కోరం సురేందర్ పార్టీ ముఖ్య నాయకులు నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు