
పయనించే సూర్యుడు జనవరి 19 : జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :… జగ్గయ్యపేట పట్టణంలో గల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద వాహనాలను నడిపే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలను మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు నిర్వహించారు.జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత ప్రయాణం కోసం ప్రతి డ్రైవర్ మంచి కంటి చూపు ఉండాలనే ఈ కార్యక్రమాని చేపట్టడం జరిగింది.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వాహనాల నిభందనలను తప్పక పాటించాలని ఆయన అన్నారు.అతివేగంతో వాహనాలు నడప వద్దని,పరిమితికి మించి ప్యాసింజర్ ని కాని,గూడ్స్ సరుకులను ఎక్కించ వద్దని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యంవిఐ కార్యాలయం సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ షేక్ ఆలాం,షరత్ చంద్ర, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ,ఆర్.గోపి కృష్ణ పియంఓ,కె మల్లేశ్వరి,వై కీర్తిశ్రీ తదితరులు పాల్గొన్నారు